మెరుగైన పౌష్టికాహారం అందించాలి : కలెక్టర్

MBNR: జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో మెరుగైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని 23వ వార్డు శివశక్తి నగర్ తెలుగు గేరి ప్రాంతంలో సోమవారం అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్న సంగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు.