నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ మంగళవారం బల్మూరు మండలంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు. ముందుగా ఆయన చెంచుగూడెంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారన్నారు. అనంతరం బల్మూరులో అంగన్వాడీ టీచర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.