ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి: సీపీఐ 

ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి: సీపీఐ 

WNP: పాన్‌గల్ మండలం పలు గ్రామాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కేంద్రాలను ఇంత వరకు ప్రారంభించలేదన్నారు. కేంద్రాల్లో ధాన్యం పోసి 10 నుంచి 21 రోజులుగా ఆరబెట్టారని, తేమశాతం రాలేదన్న సాకుతో కొనుగోలు చేయటం లేదని తెలిపారు.