గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ
JN: నర్మెట్ట మండలంలోని హనుమంతపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని, గ్రామపంచాయతీ నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేయాలని అన్నారు.