ఉచితంగా పశువులకు గాలికుంట టీకాలు'
KNR: వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో గురువారం వీణవంక పశువైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి పశువులకు గాలి కుంట టీకాలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పశువులుకు రోగ నిరోధక టీకాలు వేస్తోందని, దీంతో ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ టీకాలను వేయించాలని కోరారు. వైద సిబ్బంది, గోపాలమిత్రలు పాల్గొన్నారు.