విశాఖను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

AP: విశాఖను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 12 గంటల్లో పెద్దగంట్యాడ, భీమిలి, ఆనందపురం, మహారాణిపేట, పెందుర్తిలో 5 CMల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలపై హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.