మంచినీటి సమస్యపై ఎమ్మెల్యే స్పందన
PLD: నరసరావుపేటలో మంచినీరు రంగు మారుతోందన్న ఫిర్యాదులపై ఎమ్మెల్యే అరవింద బాబు స్పందించారు. నేరుగా చెరువులను పరిశీలించారు. సాగర్ నీరు నిలవడం, వేసవితోనే ఈ సమస్య వచ్చిందన్నారు. వెంటనే క్లీనింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని స్పష్టం చేశారు. సత్వరమే స్పందించిన ఎమ్మెల్యేను ప్రజలు ప్రశంసిస్తున్నారు.