రెండు రోజులుగా అడవిదున్న సంచారం

రెండు రోజులుగా అడవిదున్న సంచారం

అల్లూరి: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో అడవి దున్న సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. హుకుంపేట మండలంలోని తీగల వలస పంచాయతీ కామయ్యపేట, రాతులపుట్టు, గరుడాపల్లి, పామురాయి గ్రామాలకు సమీపంలోని కొండలపై రెండు రోజులుగా అడవిదున్న సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. పామురాయి వెళ్లే మార్గంలో రాత్రి రోడ్డు దాటుతూ కనిపించిందని వాహనదారులు తెలిపారు.