ధర్మవరం చెరువు వద్ద ‘జలహారతి’.. పాల్గొన్న కలెక్టర్
సత్యసాయి: ధర్మవరం చెరువు వద్ద ఇవాళ ‘జలధార-జలహారతి’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టాలను పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిపుణులతో సర్వే చేయించి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.