మెరుగైన వైద్యం అందించేందుకు కృషి: జనగామ ఎమ్మెల్యే

JN: జనగామ నియోజకవర్గం అడవి కేశపురానికి చెందిన బాదావత్ మోహన్ విద్యుత్ స్తంభం నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని ఘట్కేసర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. మోహను మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.