విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు
కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 'న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమాజంలో నేరాల నియంత్రణకు చట్టాల పట్ల అవగాహన ప్రాథమిక అవసరమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. చట్టం పట్ల అవగాహన లేకపోవడం వల్లే చాలామంది నేరాల బాట పడుతున్నారని తెలిపారు.