ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

VKB: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే లక్ష్యమని మర్పల్లి ఎంఈవో అశోక్ గురువారం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. తరగతి గదిలో పాఠాలు అర్థమయ్యేలా బోధించడంతో పాటు, విద్యార్థుల నోట్స్‌ను ఎప్పటికప్పుడు సరిచూడాలని సూచించారు.