రేపు డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

రేపు డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

KMM: రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా స్థాయిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం SR&BGNR కళాశాల ప్రిన్సిపాల్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. కళాశాల చరిత్ర విభాగం, ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యాన 'భారతదేశ స్వాతంత్రోద్యమం - ప్రపంచానికి ఆదర్శం' అంశంపై వ్యాసరచన పోటీ ఈనెల 13న ఉంటుందన్నారు.