తుది దశకు చేరిన ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణం పనులు

KMR: నియోజకవర్గ కేంద్రమైన ఎల్లారెడ్డిలో బస్టాండ్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. షట్టర్ల , మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. బస్టాండులో సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే మదన్ మోహన్ బస్టాండ్‌ను సందర్శించి 15 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ మేరకు గుత్తేదారు పనులను వేగవంతం చేయాలని కోరారు.