ఏడాదిలో 15 రోజులే తెరుచుకునే రైల్వే స్టేషన్

ఏడాదిలో 15 రోజులే తెరుచుకునే రైల్వే స్టేషన్

బీహార్ ఔరంగాబాద్ జిల్లా అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేకత ఉంది. ఏటా 15 రోజులు మాత్రమే ఈ స్టేషన్‌ను తెరుస్తారు. ఈ నెల 7న పితృ పక్షం ప్రారంభం కావడంతో ఈ స్టేషన్‌ను తెరిచారు. స్టేషన్ సమీపంలో ప్రవహించే పున్‌పున్ నది తీరంలో ప్రజలు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పిస్తారు. ఈ నదిని 'ఆదిగంగ పున్‌పున్‌' అని కూడా పిలుస్తారు.