వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా దేవుడు బాబు

వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా దేవుడు బాబు

AKP: సబ్బవరం మండలానికి చెందిన ఇండుగుబిల్లి దేముడు బాబు వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు తనకు ఉత్తర్వులు అందినట్లు దేముడు బాబు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.