లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి

ATP: ఉరవకొండ మండలం పెన్నఅహోబిలం క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పరిసరాలు, కోనేరును పరిశీలించారు.