భారీ వర్షాలకు చెరువులను తలపిస్తున్న రోడ్లు

KRNL: హోళగుంద మండలం పెద్ద గోనెహళ్ గ్రామంలో నిన్న కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు వీధుల్లో వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేక వర్షపు నీరు రోడ్లపైనే నిలబడుతున్నాయని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.