మహాలక్ష్మి ఆలయంలో దొంగతనం
NRML: నిర్మల్ పట్టణంలోని ప్రసిద్ధ మహాలక్ష్మి ఆలయంలో దొంగతనం జరిగిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఆలయ పూజారి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం అమ్మవారికి పూజ చేయడానికి వచ్చిన సమయంలో ఆలయ ద్వారం తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.