VIDEO: నకిలీ పోలీస్ అవతారం ఎత్తిన వ్యక్తి అరెస్ట్
కృష్ణా: మోటూరు గ్రామంలో నకిలీ పోలీసుగా అవతారం ఎత్తి చలామణి అవుతున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో గంగానమ్మ తల్లి దేవాలయానికి సంబంధిత కమిటీ అంతర్గత విభేదాల్లో ముద్దాయి శ్రీనివాసరావు నకిలీ పోలీసు యూనిఫామ్ ధరించి దేవాలయం తాళాలను బలవంతంగా లాక్కున్నాడని ఎస్సై చంటిబాబు తెలిపారు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.