విజయవాడలో గుర్తుతెలియని మహిళ మృతి

NTR: విజయవాడలో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లవర్ మార్కెట్ పక్కనే ఉన్న బందరు కాలువ వద్ద గుర్తు తెలియని మహిళ కాలుజారి మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు వయసు సుమారు 50 నుంచి 55 మధ్య ఉంటుందని చెప్పారు. మహిళ వివరాలు ఎవరికైనా తెలిస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ నాగరాజు కోరారు.