మిషన్ భగీరథ పైపు లీకేజ్

మిషన్ భగీరథ పైపు లీకేజ్

NRPT: ఊట్కూర్ మండలం పులిమామిడి నుంచి బిజ్వార్ వెళ్లే రహదారి పక్కన మిషన్ భగీరథ పైపు లీకేజ్ అయిందని సోమవారం స్థానిక రైతులు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. పైపు లీకేజ్ కావడంతో తాగునీరు వృథా అవడమే కాకుండా, పొలం సాగు చేయడానికి ఇబ్బందిగా అవుతోందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.