'అర్జున్ చక్రవర్తి' ట్రైలర్ రిలీజ్

ప్రముఖ నటుడు విజయ్ రామరాజు ప్రధాన పాత్రలో విక్రాంత్ రుద్ర తెరకెక్కించిన సినిమా 'అర్జున్ చక్రవర్తి'. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో 'ఖాళీ చేతులతో, కాలే కడుపుతో చేసేదే అసలైన యుద్ధం' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక కబడ్డీ ప్లేయర్ నిజమైన కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.