రైతులకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే
NLR: జలదంకి మండలంలోని రైతన్నల కోసం చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. మంగళవారం అన్నవరం గ్రామంలోని చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవుట్ పాల్ వద్ద ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ప్రవీణ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి కూటమి నేతలతో కలిసి సాగునీరును విడుదల చేశారు.