VIDEO: ఫిర్యాదులు చేసినా.. ఫలితం శూన్యం..!?
MDCL: ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ మొత్తం చెత్తాచెదారంతో నిండి ఉంటుందని, మరోవైపు పిచ్చి గడ్డి మొక్కలు విపరీతంగా ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని అక్కడికి వెళ్లిన వాకర్లు తెలిపారు. మై క్యుర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందించలేదని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం పై ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.