గోరంట్లలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ
సత్యసాయి: గోరంట్ల మండలం బాలుర ఉన్నత పాఠశాల, పులేరు ప్రభుత్వ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మంగళవారం స్టడీ మెటీరియల్స్ అందజేశారు. గోరంట్ల మండలం మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరిణి ఉచితంగా విద్యార్థులకు మెటీరియల్స్ పంపిణీ చేశారు. విద్యాధరిణి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.