కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే..?
కొన్ని చిట్కాలతో కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు. రోజూ తగినంత నీళ్లు తాగాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. రాత్రి త్వరగా నిద్రపోవాలి. కీరా దోస ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. కళ్ల దగ్గర ఐస్ కంప్రెస్ చేయాలి. లేదంటే పాలు, శనగపిండి కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకుని కళ్ల కింద అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత కడగాలి.