VIDEO: కనేకల్‌లో కూలిన బ్రిడ్జ్.. తప్పిన ప్రమాదం
ATP: కణేకల్లు మండల కేంద్రంలో చిక్కణేశ్వర వడియార్ చెరువు వద్ద బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. కొంతకాలంగా శిథిలావస్థకు చేరిన పిల్లర్లు పగుళ్లు రావడమే దీనికి కారణం. బుధవారం బ్రిడ్జి కూలడంతో గంగులాపురం,రచ్చుమర్రి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో సంబంధిత అధికారులు అప్రమత్తం అయ్యారు.