యువ వికాసంపై ఆశలు మళ్లీ చిగురింపు
NRML: జిల్లాలో నిరుద్యోగ యువత కోసం రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకానికి తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు పెరిగాయి. జిల్లాలో 37 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, త్వరలోనే రుణాల మంజూరు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రూ.50 వేల వరకు రుణాలకు 100%, రూ.4 లక్షల వరకు 80% సబ్సిడీ ప్రకటించడంతో యువత స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేస్తున్నారు.