నెమలిదిన్నెలో పరవళ్లు తొక్కుతున్న కుందూ నది

కడప: పెద్దముడియం మండలంలోని నెమలిదిన్నె సమీపంలో ఉన్న కుందూ నది పరవళ్లు తొక్కుతూ వంతెన అంచున ప్రవహిస్తుంది. పై ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో నంద్యాల జిల్లా రాజోలి ఆనకట్ట నుంచి నీళ్లు వస్తున్నాయి. ఇవి దువ్వూరు, రాజుపాలెం, చాపాడు, మండలాల మీదుగా సోమశిల జలాశయంలోకి నెల్లూరు వెళుతున్నాయి. సాగునీటి, తాగునీటికి ఇవి ఉపయోగపడనున్నాయి.