VIDEO: అమ్మమ్మపై ప్రేమాభిషేకం.. వెరైటీగా 'తులాభారం'!
MDK: నేటి యాంత్రిక జీవనంలో వృద్ధులను భారంగా భావించే వారికి భిన్నంగా, బర్దిపూర్‌కు చెందిన ఒక కుటుంబం ఆదర్శంగా నిలిచింది. తమ అమ్మమ్మ గూటూరు సుగుణమ్మపై ఉన్న అపారమైన ప్రేమను చాటుకుంటూ ఆమె మనవళ్లు, మనవరాళ్లు ఘనంగా తులాభారం నిర్వహించారు. త్రాసులో ఒకవైపు అమ్మమ్మను కూర్చోబెట్టి, ఆమె బరువుకు సమానంగా నాణేలు, పండ్లు, బెల్లం ఉంచి ప్రేమా చాటారు.