వెల్ఫేర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎస్పీ
అన్నమయ్య: జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ఎస్పీ ధీరజ్ మంగళవారం ప్రారంభించారు. సిబ్బందికి నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ప్రతి మంగళవారం జనరల్ డాక్టర్, ప్రతి శుక్రవారం స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ అధికారులకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు.