ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

JGL: ఇబ్రహీంపట్నం ఎంపీపీ కార్యాలయంలో 8 గ్రామాల వార్డు సభ్యులకు 5 రోజుల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డీఆర్డీవో రఘువరన్ హాజరై మాట్లాడుతూ.. వార్డు సభ్యులు పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, పంచాయతీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అవినీతి జరగకుండా సమష్టి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.