VIDEO: పుంగనూరు అర్బన్‌లో రోడ్ల పరిస్థితి ఇది.!
CTR: పుంగనూరు అర్బన్ ఎన్ఎస్ పేట నడిరోడ్డులో పడిన గుంతలను పూడ్చాలని ప్రజలు విన్నవిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ గుంతలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో, ఏ గుంత ఎక్కడ ఉందో తెలియక ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, సంబంధిత అధికారులు గుంతలను పూడ్చేందుకు చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.