నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
VZM: సుఖీభవ, పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 2,27,700 మంది రైతుల ఖాతాల్లో రూ.150.03 కోట్లు జమ కానున్నాయన్నారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి మొత్తం రూ.7,000 జమ అవుతుందన్నారు.