ఢిల్లీ బ్లాస్ట్.. మరో నిందితుడి అరెస్ట్

ఢిల్లీ బ్లాస్ట్.. మరో నిందితుడి అరెస్ట్

ఢిల్లీ పేలుడు ఘటన కేసులో మరొక నిందితుడిని దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేశాయి. పుల్వామా నివాసి అయిన తుఫైల్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నాయి. తుఫైల్ ఒక ఎలక్ట్రిషియన్. నిందితుడికి ఎవరితో సంబంధాలు ఉన్నాయనే దానిపై విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ కారుబాంబు ఘటనలో అతని పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.