సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని బి.జి. వెంకటాపూర్ గ్రామానికి చెందిన బాబుకు మంజూరైన రూ.12,000 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఇవాళ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసానిస్తుందని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.