వరదలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

వరదలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో రాబోయే భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ తెలిపారు. గురువారం ఆయన ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి గద్వాలలోని అగ్నిమాపక కార్యాలయాన్ని, ఎర్రవల్లిలోని 10వ బెటాలియన్ (SDRF) కార్యకలాపాలను, విపత్తుల సమయంలో ఉపయోగించే పరికరాలను పరిశీలించారు.