మతి చెడిన నేతలను అంతం చేస్తా: ట్రంప్
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 'మతి చెడిన నేతలకు ఏం జరుగుతుందో మీరే చూస్తారు' అని పేర్కొన్నారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగైందని, వైమానిక దళం కూడా త్వరలోనే ఉండదని అన్నారు. క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసం చేస్తున్నామని, వారి నాయకులు భూమి నుంచి తుడిచిపెట్టుకుపోతున్నారని వ్యాఖ్యానించారు.