పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం
SKLM: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి చిరస్మరణీయం అని రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. ఇవాళ నిమ్మడ క్యాంప్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగం తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోలేదని అన్నారు.