హరీష్ రావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ

హరీష్ రావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ

WGL: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. ఇవాళ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసానికి వెళ్లి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హరీష్ రావు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నేతలు ఉన్నారు.