రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NDL: బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామం వద్ద ట్రాక్టర్ బైకును ఢీ కొట్టింది. శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేంద్ర నాథ్ రెడ్డి అని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని స్వగ్రామం గొర్లగుట్ట గ్రామంగా పోలీసులు గుర్తించారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.