అధికారులకు జాయింట్ కలెక్టర్ వార్నింగ్

W.G: జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం ఎల్. అగ్రహారం గ్రామంలోని శ్రీనివాస ఆగ్రో రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. సీఎంఆర్ రైస్ వివరాలను మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం, బియ్యం నిల్వ లెక్కలను పరిశీలించారు.