VIDEO: పబ్లిక్ ప్రాపర్టీని ఇలాగేనా వాడేది?
హైవే పక్కన ఓ చోట హోటల్ వాష్‌రూమ్‌లో ఇద్దరు వ్యక్తులు హ్యాండ్‌వాష్‌ను ఇష్టానుసారంగా వృథా చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భారత్‌లో పబ్లిక్ సౌకర్యాలు ఎందుకు పాడవుతున్నాయో చెప్పేందుకు ఇదే నిదర్శనమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించినా, కనీస బాధ్యత లేని వారి వల్ల అవి నాశనమవుతున్నాయని మండిపడుతున్నారు.