'అనుమతి లేకుండా ధర్నాలు నిర్వహించ వద్దు'
AKP: పోలీస్ శాఖ అనుమతి లేకుండా ధర్నాలు, నిరసనలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేపట్టకూడదని రాంబిల్లి సీఐ నరసింగరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక సీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజా శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, సంస్థలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.