'ఆరోగ్య పరికరాలు అందుబాటులో ఉండాలి'

'ఆరోగ్య పరికరాలు అందుబాటులో ఉండాలి'

KMR: 108 అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు ఆరోగ్య పరికరాలు అందుబాటులో ఉండాలని 108 అంబులెన్స్ జిల్లా మేనేజర్ తిరుపతి సిబ్బందికి సూచించారు. తాడ్వాయిలోని 108 అంబులెన్స్‌ను ఆయన ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను సకాలంలో ఆసుపత్రికి చేర్చాలన్నారు. అంబులెన్స్ ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించాలన్నారు.