VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
NLR: కొడవలూరు మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ రాజపాలెం వద్ద జాతీయ రహదారి క్రాస్ చేస్తున్న ప్యాసింజర్ ఆటోను మంగళగిరి నుంచి తిరుపతి వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు టీచర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.