శాంతియుత ఎన్నికలకు సీఐ వినూత్న ప్రచారం
SRPT: హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న చివరి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా సీఐ చరమంద రాజు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. గ్రామాల్లో మొబైల్ మైక్ ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు గొడవలకు పోకుండా, కలిసిమెలిసి ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు.