'జీవీఎంసీ కొత్త నిబంధన'
VSP: విశాఖ నగరంలో వ్యాపారస్తులు తప్పనిసరిగా బ్లూ, గ్రీన్ డస్ట్‌బిన్‌లు వినియోగించాలని GVMC అదనపు కమిషనర్లు నల్లనయ్య, SS వర్మ స్పష్టం చేశారు. డస్ట్‌బిన్‌లు లేకుండా వ్యాపారం అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’లో భాగంగా నో బిన్స్-నో ట్రేడ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, జీరో వేస్ట్ లక్ష్యంగా అవగాహన కల్పించారు.