వినుకొండలో యువకుడి మృతదేహం కలకలం

GNTR: వినుకొండలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న ఎన్ఎస్పీ కాలువలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. మృతుడు ఎవరు, ఎలా చనిపోయాడు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.